రెండు వైపులా హృదయముండాలి : విరించి లక్ష్మి
 ఒకసారి జోరున వర్షం వస్తుంది. 
నాకు అప్పుడు 18/19 years వుంటాయి. అప్పుడు ఒక చాకలి ఆమె బట్టలు తెచ్చింది. ఆమె మా వాడుక ఆమె కాదు. ఆమెకు ఆరోగ్యం బాగోక ఈమెను బట్టలు ఇచ్చి రమ్మని పంపింది... సరే వర్షం వస్తుంది కదా కూర్చోమన్నాను. మిగిలిన వారు బరువైన మూటలతో తడుచుకుంటూ వెళుతున్నారు. కొందరు కూలీలు కూడా తడుస్తూ వెళుతున్నారు... ఎంత వాన! అందరం తడుస్తూ వచ్చాము అంది.
 నేను యధాలాపంగా మీకు  అలవాటేగా అన్నాను... ఆమెకు చాలా కోపం వచ్చింది. సరే నువ్వు తడువు అలవాటవుతుంది అంది.... అప్పటికి గానీ నా పొరపాటు తెలియలేదు... వెంటనే నవ్వి నిజమే చాలా కష్టం కదా అన్నాను...
మా సంభాషణ అంతా మా అమ్మ వింటూవుంది. అప్పుడు మా అమ్మ ఆమెను పిలిచి తాను ఎన్ని వానల్లో పొలం వెళ్ళి గడ్డి కోసుకు వచ్చి, గీదల్ను మేపింది, మా అక్కలు జోరున వానలో ఆ చాకలి వారి పక్కనే బట్టలు ఉతికిన సంగతి, నేను జోరు వానలో గీదల్ని మేపిన సంగతి గుర్తు చేసి మేమూ తడిసి ముద్దయ్యి అన్నం లేక పస్తులుండి కూడా మీకు పెట్టిన సందర్భాలు వున్నాయి అని ఆమెకు గుర్తు చేస్తే నిజమే పెద్దమ్మా అని ఆమె ఒప్పుకుంది...
ఇంకెప్పుడూ మమ్మల్ని అనమాకు పాలెంలో భూస్వాములున్నారు కదా వాళ్లు అసే, ఒసే అని పిలుస్తారు కదా! మీరు గడగడలాడుతూ చేతులు పిసుక్కుంటూ నుంచుంటారు కదా వాళ్లనను.. వారు ఇచ్చినంతా మేమూ ఇస్తున్నాం...వాడకకు చాకలి వుండాలని కానీ నా ఒక్కదాని కోక మా అమ్మాయి ఉతకలేక మీకు వెయ్యటంలేదు, మాకు డబ్బు ఎక్కువ వుండీ కాదు....నువ్వు చెప్పిన జడివానలో నిన్నంతా గీదల్ని మేపే వచ్చింది. ఇవ్వాళ గీదలు తిరిగే ఖాళీ లేదని తోలుకెళ్లలేదు...అయినా తడుస్తూ చావిట్లోకి, ఇంట్లో కి తిరుగుతూనే వుంది అని చెప్పింది.... 
అప్పుడు ఆమె మాట్లాడకుండా వెళ్లి పోయింది...
ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కష్టపడే రైతు కుటుంబాలను, ముఖ్యంగా అందరూ సమానమనే మమ్మల్ని వాళ్లు చాలా తేలికగా మాట్లాడే వారు...
అలాంటి వారు పోస్ట్ ల రూపంలో ఇక్కడా కనిపిస్తున్నారు.
వర్గశత్రవుని పొగుడుతూ,  మిత్ర వైరుధ్యాలను భూతద్దంలో చూస్తూ సమస్యను అలానే వుంచుతున్నారు....
బంధాలుబలపడాలంటేరెండువైపులాసుహృభావముండాలి


కామెంట్‌లు