వందనం : ---దుగ్గి గాయత్రి,టి.జి.టి.తెలుగు,పరిశోధక విద్యార్థిని

 చెరగని చిరునవ్వుతో విద్యాకుసుమాలను పంచి
సమాజపు పూదోటలో అలుపెరుగని
తోటమాలి వందనం  వందనం 
                      "చెరగని"
విజ్ఞాన, వివేకపు చెలిమెలను విద్యార్థులలో  వెలికితీసి
జ్ఞానప్రవాహమున విజేతగ నిలబెట్టిన ఓ ఉపాధ్యాయుడా వందనం అభివందనం
                  "చెరగని"
 ఉలుకూపలుకు లేని
శిలలనే శిల్పంగా మలచి విజ్ఞాన శిల్పాలుగా మలచిన రూపశిల్పి వందనం నీకు వందనం
                   "చెరగని"
నిండైన మనసుతో సమాజ భవితను లిఖించే
ఓ పరబ్రహ్మ స్వరూపమా వందనం  వందనం అభివందనం
                       "చెరగని"
నిత్య విద్యార్థివై నీలో వెలిగే దివ్వెతో
చిరుదివ్వెలెన్నో వెలిగించే  దీపమా వందనం  వందనం అభివందనం
                       "చెరగని"

కామెంట్‌లు