పేదరికం(కైతికాలు);-అక్కినర్సింలుగౌడ్.

ఈనాడు  పేదరికమే
పెరుగుతునే ఉన్నదిగా
కారణాలు అనేకమే
అగుపిస్తూ ఉన్నవిగా
ఔను అవిద్య అవివేకములు
సోమరితనం ఉచిత పంపిణీలు

ఓట్లకోసం నాయకులు
అన్ని ఉచిత తాయిలాలు
గుప్పిస్తారు హామీలను
అస్తవ్యస్త‌పు పాలనలు
వవ్వా రాను రాను దేశము
ఉచితాలతో నిర్వీర్యము

కరోనా వలన ఇంకా
పేదరికం పెరిగి పోయె
పనులు దొరకక కార్మికుడు
తమ పల్లెకు తరలిపోయె
వవ్వా ఎందరో రహదారులపై
కాలినడకన పల్లెలకు చేరినారు

ఎందరొ అనాధ పిల్లలు
 చెత్త కాగితాలు ఏరి
అమ్ముకొనియే బతుకగా
పట్టించుకునె వారేరి
వవ్వా వేలాదిమంది బాలకార్మికులు
ఇంకా దేశంలో పేదరికంలో నున్నారు

కామెంట్‌లు