వానా! వానా! రావమ్మా!!:---గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు

వానా! వానా! రావమ్మా!!
మబ్బులు చీల్చి రావమ్మా!
కుండపోతగా కురువమ్మా!
వసుధను తడిపిపోవమ్మా !

వాగులు,చెరువులు నింపమ్మా!
జగతిని జలకళ తేవమ్మా!
పైరుకు ప్రాణం పోయమ్మా!
రైతుకు మోదము పంచమ్మా!

పిల్లలకిష్టం నీవమ్మా!
రైతుకు నేస్తం నీవమ్మా!
వేళకు పుడమికి రావమ్మా
గొప్ప దానివే ! వానమ్మా!!

మానవ మనుగడ నీవమ్మా!
ప్రాణాధారము నీవమ్మా!
మొలకల తల్లివి నీవమ్మా
చినుకులు చనుబాలు కదమ్మా

కామెంట్‌లు