బాలలు-భానులు(ముత్యాల హారాలు):---గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.
చిన్నారి బాలలు
చామంతి మాలలు
సిరిమల్లె తావులు
హరివిల్లు సొగసులు

ఉదయించు భానులు
విహరించు ఖగములు
ఆలరించు పిల్లలు
తొలకరి చిరుజల్లులు

సుతిమెత్తని సుమములు
దైవంతో సముములు
ప్రేమలొలుకు పలుకులు
ముద్దులీను చిలుకలు

శ్రేష్టమైన గుణములు
శుద్ధమైన మనసులు
అందమైన బాలలు
ఆకసాన తారలు


కామెంట్‌లు