భగవతి...అచ్యుతుని రాజ్యశ్రీ

 యధారాజా తధాప్రజా అన్నారు. ఔరంగజేబు క్రూరత్వం అతని కింది ఉద్యోగుల లో నాల్గు ఆకులు ఎక్కువే ఉండేది. ఒక్కోజిల్లా అధికారి పెత్తనం తో ప్రజలు హాహాకారాలు చేసేవారు. హిందువులను లూటీ చేసి అమ్మాయిలను కిడ్నాప్ చేసి  ఆలయాలు ధ్వంసం చేశారు. బీహార్ లో ఒక జిల్లా అధికారి మీర్జా తన భటులతోనావలో పయనించి ఒక పల్లె చేరాడు.
అక్కడ కొంత మంది అమ్మాయిలు స్నానం చేస్తున్నారు. నావలోని వ్యక్తుల ను చూస్తూనే పరుగులు పెట్టారు. అందులో ఓఅందాలభరిణపై మీర్జా కన్నుపడింది. ఆపిల్ల  ఆగ్రామఠాకుర్ హోరిల్ సింహ్ ని సోదరి భగవతి."నీచెల్లిని పెళ్ళాడుతాను.నీకు ఐదు వేల  అసర్ఫియా నాణాలు  జాగీర్ఇస్తాను"అని మీర్జా  కబురు పెట్టాడు."నోర్మూయ్!నీతల ఎగరగొడ్తా"అన్నాడు ఠాకుర్.అంతే మీర్జా భటులు  అతన్ని బంధించి నావలో పడేశారు. ఊరంతా గగ్గోలు పెట్టి అట్టుడికింది. పాపం భగవతి ని అంతా తిట్టారు "నది కి జలకాలాటలకు పోయి  అన్న కి ప్రాణ హాని ముప్పు తెచ్చావు"అని అభంశుభం ఎరగని ఆపిల్లని నిందించారు.ఆమె తన వదినతోఅంది"నీవు ఏడవకూడదు.అన్నని ఇంటికి తెస్తా"అని తనే స్వయంగా మీర్జా దగ్గరకు వెళ్ళింది. "నేను నీబేగంను అవుతాను.నా అన్న ని విడిచిపెట్టు "అంది.వాడు  ఠాకూర్ ని బంధవిముక్తుడిని చేశాడు. "నాకు నావలో ప్రయాణం అంటే భయం.పల్లకీలో వస్తాఅంది.మీర్జా ఓ అందమైన పల్లకీని తెప్పించాడు.ఓచెరువు దగ్గరకు పల్లకీరాగానే"నాకు దాహం వేస్తోంది. దీనిని మానాన్న తవ్వించాడు.ఆఖరుగా దీని నీరు ఒక దోసెడు తాగాలనుకుంటున్నాను."అని ఒక్కతే చెరువు దగ్గర ఉన్న  చిన్న అమ్మవారి గుడికి వెళ్లి  ఆతల్లికి దండంపెట్టి ధబ్ మని చెరువులో దూకింది.ఆమె ఎంతకీ రాకపోవడంతో మీర్జా స్వయంగా వచ్చి చెరువంతా గాలించాడు.
 వలలు వేసి వెతికించాడు.ఆమె శరీరం కూడా మాయమైంది. అన్న హోరిల్సింహ్ కి ఈవిషయం తెలిసి పరుగులు పెడుతూ వచ్చాడు. వల విసిరాడు. ఆశ్చర్యం!?ఆమె శవం అందులో చిక్కుకుంది. తన చెల్లి పవిత్ర దేహానికి అక్కడే దహన సంస్కారాలు చేశాడు.  భగవతి కి నిజంగా  ఆతల్లి ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అనుగ్రహం ఉంది అని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.ఇదీ మన భారతీయ మహిళా విజయం!
కామెంట్‌లు