శిశోదయా వంశం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మేవాడ్ మహారాజు కి కంటిలో కురుపు లేచి ఒకటే మంట పోట్లు కన్ను ఎర్రబారింది.కనురెప్ప పైకి లేవటంలేదు. కంటినుంచి నీరు కారసాగింది.నిద్ర కరువైంది. మహామంత్రి  రాణులు అంతా విచారసాగరంలో మునిగి పోయారు.రాజవైద్యుడు  అన్నిరకాల  వైద్యాలు చేసి నిస్సహాయంగా చూడసాగాడు.  అపర ధన్వంతరి అన్న పేరున్న  అతను మహారాణా కంటి బాధను గూర్చి ఆలోచనలో పడ్డాడు. రోజు రోజుకీ బాధ ఎక్కువ అవుతోంది. గుళ్ళలో పూజలు అభిషేకాలు చేయిస్తున్నా కర్మఫలం తప్పదు. రాణా దండోరా వేయించాడు" నానేత్రరోగాన్ని తగ్గించిన వారి కి బహుమతి ఇస్తాను.నాకొలువులో పెట్టుకుంటాను." దేశవిదేశాల నించి హకీంలు మౌల్వీలు  ఫకీర్లు వచ్చినా ఫలితం శూన్యం. ఆఖరికి ఒక హకీం ఇలా అన్నాడు "ప్రభూ!నాకు  ఒక  అవకాశం ఇవ్వండి. ఒక్కొక్కసారి  ఏనుగువల్ల కాని పని చిట్టి చీమవల్ల అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. " "సరే నీ వైద్యం ప్రారంభించు."   ఆమరునాడే హకీం మందు తయారు చేసి తెచ్చి  రాణా కంటిలో వేశాడు. కొద్ది గంటల లోనే  అతని కంటి ఎరుపు మంట తగ్గాయి.చల్లగా హాయిగా ఉంది. ఆమరునాటికల్లా కన్ను పుచ్చపువ్వులాగా  విచ్చుకుంది. రాజభవనంలో ఆనందోత్సాహాలు  చెలరేగాయి. కొన్ని నెలల తర్వాత  తనరెండు కళ్లతో  ఈ ప్రపంచంని చూడటం రాణాకి  ఆనందాన్ని ఇచ్చింది. హకీం ని హృదయ పూర్వకంగా తన గుండెలకు హత్తుకుని రాణా  గొప్ప సన్మానం చేశాడు.ఆతరువాత  హకీం  తన ఇంటి కి  వెళ్ళి పోయాడు.
 ఆరాత్రి రాణాకు  ఎంతకీ నిద్ర పట్టడం లేదు. మనసంతా బాధ గా   గందరగోళం గా ఉంది. తెల్లారుతూనే  హకీం ని పిలిపించాడు."ప్రభూ!మళ్లీ  కంటి బాధ మొదలు ఐందా?"
"కాదు హకీం!కన్ను చల్లగా హాయిగా ఉంది. భవిష్యత్తులో  నారాజ్యంలో ప్రజలకు ఇలాంటి కంటి బాధలు రాకుండా  ఆ మందు తయారు చేసే విధానం  మారాజవైద్యునికి నేర్పు. భవిష్యత్తులో తరతరాలుగా  మందు తయారు గూర్చి  ఆకుటుంబానికి వంశంకి తెలిసి ఉండాలి."  "ప్రభూ!అది అప్పటికి అప్పుడు  తాజాగా చేయాల్సిన మందు. దానికోసమై ఒక పావురాన్ని చంపి దాని రక్తంని ఒక  గాజుపాత్రలోకి తీసుకుని  అందులో..."హకీం  మాటని మధ్యలోనే తుంచివేస్తూ రాణా  పెద్దగా బాధతో అరిచాడు "ఏంటీ!ఒక అమాయకపు పావురంని నాకంటి మందు కోసం  చంపేవాడివా!?ఇలా ఎన్ని  ఆమూగజీవాలు బలి అయినాయి?హే భగవాన్!నాకు ముందే ఈవిషయం  ఎందుకు చెప్పలేదు?ఈహింసతో చేసిన  వైద్యంతో నాకన్ను బాగుపడటం నాకు  ఆనందం ఇవ్వడం లేదు. బాధ తో నా గుండె చిల్లిపడింది.నాకు  ఈకన్ను అవసరంలేదు. దీన్ని  నాకత్తితో పెకలిస్తా." "ప్రభూ!వైద్యం  అందులో కలిపే పదార్ధాలు  ఎవరికీ చెప్పరు వైద్యులు"అని ఎవరు ఎంత ఓదార్చినా పశ్చాత్తాపంతో రాణా కరిగించిన సీసం తాగి బూడిద గా మారాడు.అలా శిశోదయా వంశం  చరిత్రలో నిలచిపోయింది.
కామెంట్‌లు