భారతీయ బంధాలు: - డాక్టర్ . కందేపి రాణిప్రసాద్ సిరిసిల్ల
ఆకలి జీవితాన్ని అంతా చేట లో 
గుమ్మరించుకొని చూస్తూ అతడు
కటికదారిద్య్రంలో కూడా కోళ్లకు
వడ్ల గింజల్ని దానం చేస్తూ అతడు

అన్నం ధాన్య గింజల చేట నుండి
కష్టాల మట్టి బెడ్డల్ని ఏరెస్తూ ఆమె
భర్తకు అన్నివిధాలా సాయం చేస్తూ
వైవాహిక బంధాన్ని పటిష్టం చేసే ఆమె

లక్షల్లో జీతాలు వస్తున్నా అలుపెరగక
పరుగులు తీసే నేటి ఆధునికులు కు
లక్ష్యం దిశగా సాధన చేసి పిల్లల్ని
రాచి రంపాన పెట్టీ తృప్తి లేని బతుకులకు

ఊరికురికే విడాకుల కోసం కోర్టుల కెళ్ళే
నవ దంపతులకు వారి అన్యోన్యం చెంప పెట్టు.
ముసలి తనం లో నైనా ఒక మాట పై నిలబడటం
భారతీయ బంధాలకు తొలి మెట్టు.


కామెంట్‌లు