చంచలకుమారి!....అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒక వృద్ధముస్లిం మహిళ  అందమైన చేతితో గీసిన రేఖాచిత్రాలను  అమ్ముకుంటూ గల్లీ గల్లీ తిరుగుతోంది. రూప్ నగర్ రాజు విక్రంసింహ్ సోలంకీ మహల్ లోకి వెళ్లింది. రాకుమార్తె చంచల ఆచిత్రాలను చూడసాగింది.రాజులు పాదుషాలు  నవాబుల రేఖాచిత్రాలు అవి."దాదీ!హిందూ రాజుల చిత్రాలు చూపు"అడిగింది చంచల.ఆఅవ్వ రాజా మాన్సింహ్  జయసింహ్ మొదలైన వారివి తీసిఇచ్చింది.
"అబ్బే!వారంతా ముస్లిం పాదుషాల తొత్తులు.నాకు వద్దు. "  "సరే బేటీ!ఇవి మహారాణాప్రతాప్  కరన్సింహ్ రాజసింహ్ చిత్రాలు. "అంతే చంచల  అవన్నీ తీసుకుని కానుకలు ఇచ్చింది. ఆఅవ్వ కిమొహం మాడింది.మొహం ముటముటలాడిస్తూ"రాకుమారీ!ఇది మొగల్ పాదుషా ఔరంగజేబు చిత్రం తీసుకుని  తలవంచి మొక్కు!"ధాష్టీకంగా అంది."నాఇష్టం.నేను చచ్చినా ఆపటం తీసుకోను.తలవంచను"రోషంతో మండిపడింది రాకుమారి."ఈవిషయం పాదుషా కితెలిస్తే మీరాజ్యం ని నామరూపాలు లేకుండా చేస్తాడు"బెదిరించింది అవ్వ.చంచల కి కోపం ముంచుకొచ్చింది. చెలికత్తెలని ఆజ్ఞాపించింది."ఆచిత్రాలను  కర్రతో చితకబాది తునాతునకలు చేయండి. "అవ్వ వాటి డబ్బుని కూడా చంచల దగ్గర వసూలు చేసి ఢిల్లీ వెళ్ళి రాకుమారి చంచల ని గూర్చి విషప్రచారం చేసింది. ఔరంగజేబు చెవికి ఈమాట  చేరింది. వెంటనే  రూప్ నగర్ పై దాడి చేశాడు. "ఆ పిల్లని పెళ్ళాడి దాని పొగరణుస్తా"అని  ప్రతిన బూనాడు."నీకూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయకుంటే  మీరాజ్యం నీ కుటుంబం సర్వనాశనమై పోతారు "అని సోలంకీ కి కబురు పంపాడు. "తల్లీ! పెద్ద పెద్ద రాజులే ఢిల్లీ పాదుషాకి తల ఒగ్గారు.తమకుమార్తెలను అతని దగ్గరకు పంపారు. మన రాజ్య ప్రజారక్షణకై నిన్ను డోలీలో పంపుతా. నీవు ఈత్యాగం చేయకతప్పదు."చంచల ధృడంగా అంది"నేను చచ్చినా వాడి దగ్గరకు వెళ్లను.""నేను  ఓడిపోతే ఎలాగో నిన్ను ఈడ్చుకుని వెళ్తాడు. మనప్రజలు సైన్యం నాశనం అవుతారు తల్లి!" "నా రక్షణ నేను చేసుకోగలను నాన్నా".
చంచల వెంటనే  మహారాణాప్రతాప్ వంశీయుడైన రాజసింహ్ కి తన పరిస్థితి వివరించి  సాయం చేయమని అర్థించింది.ఓలేఖ రాసి పంపింది.  ఔరంగజేబు సేనాని  చంచల కుమారిని  పల్లకీలో తీసుకుని వెళ్లుతుండగా ఆరావళీ పర్వత ప్రాంతంలో వారిపై పెద్ద పెద్ద బండలు దొర్లించారు.చాలా మంది ఢిల్లీ సైనికులు నలిగి హరీఅన్నారు.రాణా రాజసింహ్  ఆ కొండలపైనించే మొగల్ ల పై విరుచుకు పడ్డాడు. "రాకుమారీ!నీతండ్రి దగ్గరకు సురక్షితం గా చేరుస్తా"అన్నాడు. ఆమె అతని పాదాలపై బడి"నేను మీభార్యను.పుట్టింటితో నాకు సంబంధం లేదు "అంది.
రుక్మిణి దేవి కూడా  కృష్ణ భగవాన్ నితో అలాగే వెళ్ళింది. 
మన భారతీయ మహిళలకు స్వేచ్ఛ సర్వహక్కులు ఉండేవి. విదేశీ  తురుష్కుల బారి నుండి  తమ భార్య కూతురి ని కాపాడుకోవడం కోసం పరదా ఘోషాప్రవేశపెట్టారు. ఇది చరిత్ర ని వక్రీకరిస్తూ రాసిన రాతలు మనం చదివి అపోహ లో ఉన్నాము. నార్త్ ఇండియా  రాజపుత్ర వీరనారీమణుల సాహసాలు  త్యాగాల తో పునీతమైంది.
కామెంట్‌లు