సెప్టెంబర్ 21,*శుభాకాంక్షలు అందిస్తూ*
*అక్షరహారతి!*
---------------------
1.ఆధునిక యుగాన మహాకవి!
ఏనాటికీ వన్నె తగ్గని పవి!
హృదయాకాశాల్లో,
అస్తమించని రవి!
నీ ముత్యాల సరాలు!
నిత్య సత్య స్వరాలు!
చదువరుల వరాలు!
2. ఓ వైతాళికుడా! గురజాడ!
కవితారాజమార్గాన,
అక్షరపాలరాతిమేడ!
"దేశభక్తి!"చెరగని గురు జాడ!
దేశమే దైవం!
నవవిధ భక్తి ఏల?
దేశభక్తి చాలదా!
తనువు పులకించదా!
"తృప్తి" నీయదా!
"ముక్తి" దారి చూపదా!
3."మనిషి" మనిషికి ఆలంబన!
"కాసులు" ప్రేమ ఆధారశిల!
"కన్యక" మగువ తెగువ,
విజయసూచిక!
"పూర్ణమ్మ" మనసు కరిగించే,
వెన్నెల బొమ్మ!
"లవణరాజు కల ",
నిజమవుతుంది!
వర్ణధర్మాన్ని ప్రశ్నించిన ప్రజ్ఞ!
మేమంతా ఆచరించే ప్రతిజ్ఞ!
4.యెంచి చూడ రెండే!
అవి మంచి చెడే!
ఈ నీ వాక్కు!
జగానికి,జనానికి వేదవాక్కు!
5.నీమాటలు మంత్రపుష్పాలు!
కవితా సరస్వతి కన్నుల,
ఆనందబాష్పాలు!
నీ అక్షరహారతి!
ఆరని హారతి!
"లంగరెత్తుము" సందేశం,
"దేశం కొరకు పోరుము!"
అదే,సదా దిశానిర్దేశం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి