ముక్కోటి దేవతులున్నా
అగ్ర పూజలందుకునే విఘ్నవినాయకుడవైనావు
ఆబాలగోపాలం భక్తి తో పూజించు గణనాథుడవు నీవు
గరిక పూజలకు మెచ్చు గణపతి కి మొక్కి
ఇంట పందిరి వేసి వ్రతమాచరించిన
వీధివీధినా మండపాలు కట్టి నిన్ను కొలువు చేసి ఆరాధించినా
జయ శుభకరములు కలుగు మాకు
నీ గజముఖము బుద్ధికుశలతకు చిహ్నమై
నీ చేతి పాశం మోహ వినాశనము చేసి ఆయుధమై
అంకుశమే ధర్మ నియంత్రత్వానికి మార్గదర్శిగా
నీ చేతి మోదకం ప్రమోద సూచికగా
సిద్ధి బుద్ధి సానుకూలతకు ప్రతీకలై వెలసిన నీ తత్వరూపము
సత్వమై విరాజిల్లు అపురూపము
మూషిక వాహనుడిగా నీరాజనములందుకున్న వక్రతుండ మహాకాయ
నిన్ను షోడశోపచారాలతో పత్రి పూజ చేయుదురు
కళాకారులెందరో నిన్ను వివిధ ఆకృతులతో
తీర్చిదిద్దగా విశ్వనాయకుడవైనావు
మట్టి ప్రతిమను చేసి ప్రణమిల్లెదము
భక్తి శ్రద్దల తో నిన్ను నిమజ్జనం చేసి ప్రకృతిని కాపాడెదము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి