మధుర జ్ఞాపకాలు:-పిల్లి.హజరత్తయ్య, శింగరాయకొండ

ఊహ ప్రేయసితో ఊసులడాలని
ఊరించే కన్యతో కబుర్లు చెప్పాలని
ఊహసుందరితో పరుగులు తీయాలని
ఊర్వశితో అవనిని చుట్టాలని
ఉబలాటపడుతుంది ఊరించే మనసు..!

కనులు తెరిచిన నీ రూపమే
కనులు మూసినా నీ జ్ఞాపకమే
కలలో కనిపించేది నీ బాసలే
కరోనా కాలంలో నీ ఊసులే
కవ్విస్తుంది ప్రేమించే మనసు..!

మెచ్చిన మగువతో ముచ్చటించాలని
మదిలో భావాలను తెలియజేయాలని
మంచిరోజున ప్రేమను తెలపాలని
మనువు గురించి గుసగుసలాడాలని
మురిపిస్తుంది మోహించే మనసు..!

నిత్యం కనులలో మెదిలే అందాలు
నిరంతరం గుర్తుచ్చే జ్ఞాపకాలు
నీతో గడిపిన మధుర క్షణాలు
నిద్రలేని ఎన్నో రాత్రులు
నిన్ను చేరాలంటుంది విహరించే మనసు..!

ఎన్నటికైనా నన్ను చేరుతావని
ఎప్పటికైనా నీవు నాదానివేనని
ఎక్కడికైనా నీతోనే నా ప్రయాణమని
ఏదో ఒకరోజు ఒకటి అవుతామని
ఉరకలేస్తుంది ఊహించే మనసు.!కామెంట్‌లు