*బాలనరేంద్రుడు*(కథ)("రాజశ్రీ"కవితా ప్రక్రియ లో)(నాలుగవభాగము):-:డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 13)
చిన్న నాడె సాహసమును
చూపి చెలుని రక్షించెను
బాలలు అందరికి అతడు
ఒక బాట చూపించాడు!
14)
నరేంద్రుడు అతని పేరు
మురిపెముగా అతను పెరిగినారు
వివేకానంద స్వామిగ అతడు
విమల యశము గడించాడు!
15)
భారతీయ ధర్మం తల్లివంటిదని
ప్రపంచ మతాలకు మూలమైనదని
అన్నిమతాల సత్యాలను గ్రహించాలన్నాడు
మతాలపేరిట కలహాలు మానాలన్నాడు!
16)
వివేకానందుడుగా దేశాలెన్నో తిరిగాడు
భారతీయ తాత్వికతను ప్రబోధించాడు
అయినారు ఎంతోమంది శిష్యులు
పాటించారు ఆతని బోధనలు!
(సమాప్తము)

కామెంట్‌లు