దేశ గౌరవం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మాకు దేశభక్తి ఉంది అని నోటి తో చెప్పటంకాదు.దేశ గౌరవం కి భంగం కలిగించే మాట చేతలు కూడదు.బాల్యం నించి  పెద్దలు నేర్పాలి. తాము ఆచరించాలి కూడా. ఖాతేయహా గాతేవహా లాగా మనదేశం ని విమర్శించటం మంచిది కాదు.
ఈదేశభక్తి దేశం గౌరవం నిలిపేపనులలో వృద్దులను గౌరవించే విషయంలో జపాన్ వారిది ప్రథమస్థానం. ఒకసారి స్వామి రామతీర్ధ  జపాన్ వెళ్లారు. రైలు ప్రయాణం చేస్తున్నారు. ఆయనకు తింటానికి ఫలాలు ఎక్కడా కనపడలేదు. "హు!జపాన్ లో పళ్ళు దొరకవు కాబోలు?"అని స్వగతంగా  అనుకోటం ఓయువకుడు విన్నాడు.భార్య ను రైలు ఎక్కించాలని వచ్చాడు. ఆమెతో కబుర్లు చెప్పటం ఆపి వెంటనే  ఎక్కడికో వెళ్లి చేతిలో చిన్న బుట్ట నిండా పళ్ళు తెచ్చి ఇచ్చాడు.స్వామీజీ పళ్ళు  అమ్మే వ్యక్తి గా భావించి డబ్బు ఇవ్వ బోతే  అతను  నిరాకరించాడు."స్వామీ! మాదేశంగూర్చి  మంచిగా చెప్పండి  చాలు!"ఎంతటి ఆత్మవిశ్వాసం దేశభక్తి అతనిది!అని స్వామీజీ అభినందించారు.  
ఇక జపాన్ లో ఒక విదేశీ విద్యార్ధి  ప్రభుత్వ లైబ్రరీలో ఒక పుస్తకం  చదవాలి అని తీసుకుని తన గదికి వెళ్ళాడు.ఆపుస్తకం లో చిత్రాలు నచ్చి ఆపేజీలు చింపి దాచుకున్నాడు.ఇది ఒక జపాన్ కుర్రాడు గమనించి లైబ్రరీలో ని అధికారికి చెప్పాడు.వెంటనే ఒక పోలీసు వచ్చి  గది సోదా చేసి  ఆయువకుని నించి చిత్రాలు స్వాధీనం చేసుకున్నాడు. అతనిని వెంటనే  స్వదేశంకి పంపటమేకాదు లైబ్రరీ బైట  బోర్డు పెట్టారు"ఫలాని దేశం వారి కి  లైబ్రరీలోకి ప్రవేశంలేదు అని.ఇలా వెంటనే  చర్య తీసుకోకపోతే అక్రమాలు  అత్యాచారాలు రోజు సాగుతాయి. ఇదీ దేశభక్తి దేశప్రేమ అంటే!
కామెంట్‌లు