పొడుపు కథలు. సేకరణ తాటి కోల పద్మావతి గుంటూరు.

 యంత్రం కానీ యంత్రం కాదిది మంత్రం.
జవాబు సాయంత్రం .
రసం కాని రసం. పళ్లరసం మాత్రం కాదు.
జవాబు నీరసం.
లక్షల మంది రాణులు. ఒకడే రాజు. రాత్రి కి వస్తాడు ఉదయం పోతాడు.
జవాబు చంద్రుడు.
శివరాత్రికి శివ శివ అని పోయింది.
జవాబు చలి.
చక్కని మానికి చిక్కని గజ్జెలు.
జవాబు సజ్జ కంకి.
హారం కానీ హారం. చెప్పు నీవు మారాం చేయక.
జవాబు ఆహారం.
సన్నని దంతాలు ఉన్నాయి కానీ ఎలుకను కాను. కుచ్చు తోక ఉన్నది కానీ నక్కను కాను. వీపున సార్ ఉన్నాయి గాని పామును గానూ.
జవాబు ఉడుత.
వంకర టింకర మాను ఎందరు ఎక్కిన విరగదు.
జవాబు దారి.
లోపల తీపి, పైన తీపి, అంత తీపి.
జవాబు మామిడి పండు.
రాజు గారి ఇంట్లో రోజా పువ్వు అన్నకు అందదు తమ్ముడికి అందుతుంది.
జవాబు పెదవులు.
వంక గాని వంక ఏమిటా వంకా?.
జవాబు నెలవంక.
కామెంట్‌లు