ఆకలి పెరగడానికి...పి . కమలాకర్ రావు

  ఆకలి లేక పోవడానికి  అంతకు ముందు మనం తిన్న ఆహారం అరగకపోవడం ఒక కారణం. పొట్టలోని కదలికలు తగ్గిపోతే అజీర్తి ఏర్పడి ఆకలి పుట్టదు. ఏది తినాలనిపించదు. హుషారు తగ్గిపోతుంది.
 జీలకర్రను దోరగా వేయించి, కొద్దిగా సైంధవ లవణం కలిపి పుక్కిట పెట్టుకొని రసం మింగాలి. అజీర్తి తగ్గిపోతుంది.
2. ఉసిరికాయ రసం  లేదా ఉసిరి వరుగులు రసం  మరియు నిమ్మరసం  లో కొద్దిగా ఉప్పు కలిపి త్రాగితే ఆకలి పెరుగుతుంది.
3. కొద్దిగా సొంపులో సొంటి పొడి వాము పొడి ని నీళ్లలో వేసి మరిగించి చల్లార్చి త్రాగాలి. ఆకలి పెరుగుతుంది.
4. మారేడు ఆకులను కడిగి నీళ్లలో వేసి మరిగించి చల్లార్చి వడపోసుకొని త్రాగిన నాకూడా ఆకలి పెరుగుతుంది.
5. జిలకర  ధనియాలు వాము సమాన భాగాలుగా తీసుకొని నీళ్లలో మరిగించి చల్లార్చిన కషాయాన్ని రోజంతా అప్పుడప్పుడు త్రాగుతూ ఉండాలి.. ఇది పొట్టను పూర్తిగా శుద్ధి చేస్తుంది. మంచి ఆకలి పెరుగుతుంది.
కామెంట్‌లు