:ఉపాధ్యాయులు:-యెల్లు అనురాధా రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేట

 శతకోటి వందనాలు అందుకో
 దారి చూపే గురువులు
 ఆది నారాయణులు
వెన్నెల సిరి నవ్వులు //2//

 అలుపెరగని పయనము
 ఎంత దూరమో తెలియదు
 ఉత్సాహమే నింపుతూ
 మెదడుకు పదును పెట్టుతూ
//శత//
 
ప్రతి ఒక్కరిని కలుపుతూ 
 అన్ని అంశాల పాఠాలు
 సెలవు లేకుండా రాయిస్తూ
 తప్పులు వెంటనే సరి చేస్తూ
//శత//
 ప్రశంసల వర్షం కురిపిస్తూ
 ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ
 వెన్నుతట్టి ముందుకు నడుపుతూ
 ధైర్యం మంచిని అందజేస్తూ
//శత//
 ఒడిదొడుకులను అధిగమిస్తూ
 కళామతల్లికి సేవలు చేస్తూ
ఉన్నత స్థానం పొందారు
 అందరి మనసున నిలిచారు
 ఆ దేవత దీవెన పొందారు
//శత//

కామెంట్‌లు