*దేవనాగరిభాషా (మణిపూసలు*)*:----*మిట్టపల్లి పరశురాములు*సిద్దిపేట

సకల జనుల భాష హింది
 కవుల కలమున మెరిసింది
 రాజభాషగ దిద్దుకొని
 దీపజ్యోతియైవెలిగింది
 
తులసి దోహెనందు నిలచి 
 భాషప్రియుల నెల్ల వలచి 
జనుల మనసుకత్తుకొనియు
మదిని దోచే కవిత మలచి

భక్తి సుధలుకురిపించెను
ముక్తిపథముజూపించెను
రహిముదోహెకవితఝరులు
గలగలలానురికించెను

విశ్వమంత వెలిగె భాష 
జగతిరేడుమెచ్చుభాష
పొరుగుదేశజనులుపొగుడు
పసందైన హింది భాష

           ******
(జాతీయహిందీభాషాదినోత్సవసందర్భంగా..)
కామెంట్‌లు