పూల వంటి బాలలు:---గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.
పూల వంటి బాలలు
పాల వోలె మనసులు
పాలవెల్లి సొగసులు
వేలకొలది శ్రేష్టులు

తెలుగులాగ మధురము
వెలుగుమయం హృదయము
సదనములో అభయము
వదనములో ఉదయము

మాటలు మకరందము
బాలల అనుబంధము
విరిసిన మందారము
పరిమళ సుమగంధము

పిల్లలున్న అందము
మల్లెపూల చందము
అమూల్యమున బాల్యము
అవనిలోన భాగ్యము

 

కామెంట్‌లు