ఇదో ప్రపంచం: -సత్యవాణి

ఇదో ప్రపంచం ఇదో ప్రపంచం ఇదో ప్రపంచం
 పిలుస్తోందోయ్
మత్తులోని గమత్తులు చూడగ రారమ్మని జాతిని
బులిపిస్తోందోయ్      ఇ

చేయగ పని ఇంతైనా లేదిట
చూడగ అన్యాయమ్మే అన్నిట
జాగృత మెందులకు నీకనీ
మత్తులోనె మహదానందం కలదని                    ఇ
          
తిండితొ పని లేదచ్చట
తెలియదు బాహ్య ప్రపంచం
తేలి సోలి పోయె స్వర్గం
అనుభవించ రారమ్మంటూ
                               ఇ
మూడు పదులు చూడవు నీవు
ముక్తికాంత వరించగనిన్ను
ఇచ్చతోడ కౌగిలించగా ఆమెను
ఇలను వదిలి రారమ్మంటూ                    ఇ ఇ

              
కామెంట్‌లు