గొప్ప మనసులు! అచ్యుతుని రాజ్యశ్రీ

 కమాల్ పాషా టర్కీ ప్రెసిడెంట్ గా ఉన్న రోజులవి! రాజధానిలో పుట్టిన రోజు వేడుకలు ధూంధాంగా జరుగుతున్నాయి.లక్షలకొద్దీ నగదు బహుమతులు ఆయనకు సమర్పించారు ప్రజలు.వేడుకలు పూర్తికాగానే  తనభవంతి మేడపైకి వెళ్లి దుస్తులు మార్చి పడకపై వాలాడు.అప్పుడే  ఒక పల్లెటూరి పేదరైతు 30మైళ్ళు కాలి నడకతో వచ్చి  తను తెచ్చిన కానుక  పాషా కు సమర్పించుతా అని  అక్కడి సిబ్బంది ని బ్రతిమాలసాగాడు. అక్కడి సిబ్బంది  సెక్రెటరీ  కుదరదు వెళ్లి పొమ్మని గదమాయించారు.కానీ  ఈవార్త తెలుసు కున్న పాషా గబగబా మేడదిగి వచ్చాడు. ఆవృద్ధుని కానుక స్వీకరించాడు.ఆ కానుక ఏమిటో తెలుసా?చిన్న మట్టి ముంతలో తను స్వయంగా తేనెతుట్టె నుండి సేకరించిన తేనె. కమాల్ పాషా  ఒక వేలు అందులో ముంచి తన నోటి లో పెట్టుకుని తేనె ను చప్పరించాడు.రెండో వేలు తేనె లోముంచి ఆరైతు నోటి లో పెట్టాడు."తాతా!అన్ని కానుకలకన్నా నీవు ఇచ్చిన  ఈకానుక అత్యంత విలువైనది. తేనె కన్నా తీపి నీ అమృత హృదయం "అని అతనిని కానుకలిచ్చి తనకారులో ఆరైతు ఊరిదాకా సాగనంపాడు.
మనదేశంలో కూడా  ఇలాంటి సంఘటన జరిగింది. ఒక రైతు  మంచంని రకరకాల  రంగులు డిజైన్లలో అల్లి ఢిల్లీకి తెచ్చాడు రైలు లో. స్టేషన్ లో దిగి అప్పటి ప్రధాని నెహ్రూ ఉండే భవంతి దాకా  భుజాల పై మోసుకుంటూ వెళ్ళాడు. నెహ్రూ బైట పచార్లు  చేస్తున్నాడు."ఎవరునీవు?ఏంకావాలి?" "ఈమంచం ని స్వయంగా  కళాత్మకంగా మీకోసం అల్లాను.మీరు స్వీకరించాలి."వెంటనే  నెహ్రూ తన ఫోటో పై సంతకంచేసి అతనికి గిఫ్ట్ గా ఇచ్చాడు.దురదృష్టం ఏమంటే  ఆవ్యక్తుల ఊరు పేరు  పేపర్ పుస్తకం లో  రాయకపోవటం.మనం తెలుసు కోవలసినది ఏమంటే  కానుక విలువకాదు ఆఇచ్చే వారి ప్రేమ ఆప్యాయత గ్రహించాలి.పిల్లలు చిన్న పూవు ఇచ్చినా టీచర్  సంతోషంగా తీసుకుని తలలో పెట్టుకుంటుంది.ఆ పిల్లల మొహాలలో వెలిగే ఆనందం  చూసేవారికే తెలుస్తుంది సుమా!
కామెంట్‌లు