మంగళగిరిలోని స్కూళ్లు.. కళాశాలల అధ్యాపకులు.. ఉపాధ్యాయుల కు సత్కారం

 మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి...ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పాత మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీలో.ఆదివారం . మంగళగిరిలోని స్కూళ్లు.. కళాశాలల అధ్యాపకులు.. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.మంగళగిరిలోని  వి టి జె యమ్ & ఐ వి టి ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్  శ్రీ వెంకటేశ్వర యోగి.. సి కె జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ అత్తోట రత్నబాబు..సి కె హైస్కూల్లో పనిచేసి రిటైరైన ఉపాధ్యాయిని శ్రీ సవలం సామ్రాజ్యం..చిన్నకాకాని జడ్. పి హైస్కూల్ హిందీ పండిట్ శ్రీ ఇందుపల్లి రామారావు.. స్కూల్ అసిస్టెంట్ కోదాటి సుబ్బారావు.. బేతపూడి గ్రామంలోని ప్రభుత్వ  ఎలిమెంటరీ స్కూలు ప్రధాన ఉపాధ్యాయిని శ్రీ మాదాల రోజారాణి..తదితర ఉపాద్యాయులను శ్రీలక్ష్మీనరసింహస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మేకల మోహనరావు శాలువా..పూలమాలలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా శ్రీరాధాకృష్ణ యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు శ్రీ రాధాకృష్ణ యోగి.. విజిలెన్స్ పత్రిక ఎడిటర్ బుల్లా రాజారావు..రిటైర్డ్ ఏఎస్ఐ పత్తిపాటి బాబురావు.. ఆంధ్ర ప్రదేశ్ యూనివర్సిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నూతక్కి వెంకటేశ్వరావు  పాల్గొన్నారు. సన్మాన గ్రహీతలైన ఉపాద్యాయులను.. సొసైటీలో చదువుకుంటున్న విద్యార్థులు..అతిధులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు
 
కామెంట్‌లు