భాషా సంస్కారం.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 చదువులో కానీ, ఉద్యోగంలో కానీ రాణించాలంటే సందర్భోచితంగా తగిన చేష్టలతో చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి. పెద్దలతో ఎలా మాట్లాడాలో, తన సమవయస్కులు లతో ఎలా మాట్లాడాలో చిన్న వారిని ఎలా పలకరించాలి తప్పకుండా అభ్యసించాలి. పెద్ద పెద్ద పరీక్షలు ఫ్యాసయిన తర్వాత కూడా చక్కగా మౌఖిక పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారికే విజయం కలుగుతుంది. అనుచితంగా మాట్లాడరాదు. ఇతరుల మనసు నొప్పించ రాదు. అనవసరంగా కనుబొమ్మలు ఎగురవేయడం, చేతులు తిప్పడం వంటి అలవాట్లు మానుకోవాలి. ఊతపదాల వాడుకను కూడా పరిహరించాలి. పురాణాలలో శిశుపాలుడు, దుర్యోధనుడు వంటి వారు అధోగతి పాలు కావడానికి వాళ్ళ చెడ్డ నోళ్లు కారణం.
భాషా సంస్కారం పట్ల వినయంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. అపకారం చేస్తే పాపం వస్తుంది. పిల్లలు తూనీగల లాంటి చిన్న పురుగుల్ని పట్టుకుని వాటి రెక్కలు వివరిస్తూ ఉంటారు. అది వారికి ఆటే కావచ్చు. దానివల్ల తరువాతి జన్మలో శూలాల శిక్షను అనుభవించిన మాండవ్య ముని కథ వాళ్లకు తెలియడం మంచిది. అలాగే హాస్యానికి ఒక మహర్షి పై పామును విసిరేసిన పరీక్షిత్తు ఋషి శాపానికి ఎలా గురి అయ్యాడని భాగవతం చెప్తుంది. పిల్లలకు ఇలాంటి విషయాలను చెప్పటం పెద్ద వారి బాధ్యత.

కామెంట్‌లు