నీటి కుళాయి -బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు

నీటి కుళాయి నేటి సుఖమోయి 
అందరికి జలాలు అందుబాటోయి 
జలమే ప్రాణాధారమోయి 
నీటికీ పొదుపు ఉండాలోయి !

ఒక్క బిందె త్రాగునీరు 
కొట్టి చూడు వీధి బోరు 
సన్నగాను వచ్చు ధారలు 
దాహార్తికి అమృతములు!

టాపుతిప్పు కుళాయిలు 
పట్టణంలో  వీధుల్లోను 
టాపు తిప్పి వదిలేయకు 
అది చాలా నేరమగును !

భూగర్భం లోని నీరు 
అదృశ్యం అయిపోవును 
ఒక్క బిందె నీటి కొరకు 
ఎంతో దూరం పోదగును !

వాడుక నీరు కాలువ చెయ్యి 
చెట్లూ మొక్కల పాదులవెయ్యి 
నీటి సరఫరా నిత్యం ఉండిన 
పూలూ పండ్లు ఇచ్చే చెట్లోయి!

కామెంట్‌లు