ఎంతో అందము:---గద్వాల సోమన్న

విరిసిన పూవులు
కురిసిన చినుకులు
ఎంతో అందము
మోమున నగవులు

నిండిన చెరువులు
పండిన ఫలములు
ఎంతో అందము
పారే యేరులు

పచ్చని మొలకలు
ఎగిరే పక్షులు
ఎంతో అందము
నవ్వే ముఖములు

నింగిని భానులు
మిలమిల తారలు
ఎంతో అందము
గృహమున బాలలు

మేలిమి బుద్ధులు
నైతిక విలువలు
ఎంతో అందము
ఇంటికి పెద్దలు

ఇంటికి వనితలు
వెలిగే జ్యోతులు
ఎంతో అందము
అమ్మానాన్నలు

కామెంట్‌లు