"ట" గుణింత గేయం:-- మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలు-జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 టక్కరి వారిని చేయొద్దు
టాటాలు తెలుసుకో
టికెట్ లేని ప్రయాణము
టీచరు చెప్పింది వలదని
టూ అంటే ఆంగ్లంలో రెండు
టూకిగా చెప్పండి 
టృ ను ఉచ్చరించండి
టౄ పదాలు దొరకవు
టెక్కులు వీడి మనమంతా
టేకుటాకులో భోంచేద్దాం
టైమును పాటిద్దాం
టొమాటో కూర అద్భుతం 
టోకుగ కలిసి వెళ్దాము
టౌను తిరిగి చూద్దాము
టంకసాలను గమనిద్దాము.

కామెంట్‌లు