" ద" గుణింత గేయం:---మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 దయగలిగి యుండాలి
దాన గుణం మంచిది
దిన రాత్రులు కష్టించి
దీవెనలు  అందుకోవాలి
దురితపు పనులు మానాలి
దూరపు చూపు ఉండాలి
దృఢ సంకల్పం ఉండాలి
దౄ అక్షరం గమనించండి
దెబ్బ లాడుట మానాలి
దేశానికి  సేవ  చేయాలి
దైవములా  కొలవాలి
దొబ్బులు  పడకూడదు
దోపిడీ చేయకూడదు
దౌర్జన్యం మంచిది కాదు
దండిగ బ్రతుకు బ్రతకాలి.

కామెంట్‌లు