సేవే పరమావధి-డాక్టర్ అడిగొప్పుల సదయ్య(ముత్యాలసరాలు)
సేవ చేసిన చేవ కలుగును
సేవ చేసిన సేసలిడుదురు
సేవ చేసిన చిరము నిలుతుము
సేవ చేయర సోదరా!

సేవె భాగ్యము సేవె యోగ్యము
సేవె శక్తిద సేవె ముక్తిద
సేవె నిత్యము సేవె సత్యము
సేవ చేయర సోదరా!

సేవలోనే సౌఖ్యముండును
సేవలోనే తుష్టియుండును
సేవలోనే కీర్తియుండును
సేవ చేయర సోదరా!

శ్రియాదేయము హ్రియాదేయము
ప్రియాదేయము చేయవలెరా!
దయానందము పొంగి పొరలగ
సేవ చేయర సోదరా!

సేవె కర్మము సేవె ధర్మము
సేవె మర్మము సేవె నర్మము
సేవె సర్వము సేవె పర్వము
సేవ చేయర సోదరా!

సేవలోనే దేవుడుండును
సేవతోనే ఆత్మశుద్ధి
సేవ పెంచును హృదయ పరిధిని
సేవ చేయర సోదరా!

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125


కామెంట్‌లు