*(గుంటూరు శేషేంద్ర శర్మ : *ఎం. వి. ఉమాదేవి

ఇంద్ర జాలము కవితలు 
మందస్మిత నవ చరితలు 
గుంటూరు శేషేంద్ర శైలి
కాలముకు  నిల్చు  గురుతులు!

ఆజానుబాహు రూపము 
సంస్కృతాంధ్ర తేజము 
ప్రాకృత రచనల  వ్యాఖ్య 
సులభశైలిని సుందరము!

విశ్వ మానవత వాదము 
వాక్కు భావనలు  మధురము 
నవయుగ భావ కవిగాను 
నెల్లూరు కవి పరిచయము !

విలక్షణ రచనలు చేసె 
సినిమా పాటనూ వ్రాసె
నోబెల్ కు నామినేటయి 
స్థాయిని అందరూ  చూసె!
కామెంట్‌లు