అనువాద పురస్కార గ్రహీత కు అభినందనం: వేంపల్లి గంగాధర్

 ఇప్పుడు వారికి దాదాపు 70 సంవత్సరాలు.
రాత్రి  వారికి  నా ఆత్మీయ శుభాకాంక్షలు  చెప్పాను. ఎంతో సంతోషించారు.
 వారి స్వరం లో ఇంకా ఎంతో ఓపిక కనిపించింది. అందుకు మరొక్కసారి వారికి  నిజంగా అభినందనలు చెప్పాలి. 
కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ అనువాదకులు రంగనాథ రామచంద్రరావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ప్రకటించడం సంతోషదాయకం.
సెప్టెంబర్ మాసం 2011  లో  కర్ణాటకలోని ధార్వాడ్ నందు కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు మొదటిసారిగా రంగనాథ రామచంద్రరావు గారు అక్కడ పరిచయమయ్యారు. ఉదయం ఆరు  గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుని  తిరుగుతూ కనిపించారు.  అప్పటి నుంచి వారితో స్నేహం కొనసాగుతూనే ఉంది. 
అత్యుత్తమ కన్నడ రచయిత  పి. లంకేష్ గారి రచన  ను సాహిత్య అకాడమీ కోసం ' రాళ్లు కరిగే వేళ' గా  వీరు చేసిన అనువాదం 2010 లో వచ్చింది. అందరి ప్రశంసలు అందుకుంది. తర్వాత  వారు  సాహిత్య అకాడమీ కోసం కథలు నవలలు... తిరుగుబాటు, వడ్డా రాధన , వాగు వచ్చింది,  మరిగే ఎసరు వంటి రచనలు చేశారు. # కన్నడంలో శాంతినాథ దేసాయి రాసిన  ' ఓం ణమోః ' నవలను తెలుగులోకి అనువదించారు. అందుకు గాను రంగనాథ రామచంద్రరావు గారు  కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారానికి ఎంపికయ్యారు.#
 అనువాద సాహిత్యం లో విస్తృతంగా కృషి చేశారు.  దాదాపు 300 కథలకు పైగానే వచ్చి ఉంటాయి.
 రిటైర్డ్ గణిత ఉపాధ్యాయుడు గారికి మరొక్కసారి శుభాకాంక్షలు.
కామెంట్‌లు