సూక్తులు : సేకరణ- పెద్ది సాంబశివరావు

  
సూక్తులు, సామెతలు, సుభాషితాలు, మంచి మాటలు అన్నీ అనుభవంతో చెప్పిన మాటలు. సంభాషణల్లో వీటిని తరచుగా వాడుతుంటారు. ఒక్కొక్క విషయం గురించి కొన్ని సూక్తులను ఈ శీర్షికలో అందిస్తున్నాము. 
 
 
అందం 
కళ్లలో అందం కనిపిస్తుండాలంటే ఇతరుల్లో మంచినే చూడు, పెదవులు అందంగా ఉండాలంటే దయతో కూడిన మాటలే మాట్లాడు.నీ భంగిమ బాగుండాలంటే నువ్వు ఎన్నడూ ఒంటరిగా లేవనే విశ్వాసంతో నడువు.  ఆడ్రే హెప్ బర్న్
కళ్ళల్లో కళ, వ్యక్తీకరణలో అందం, అక్షరాల్లో కాంతి, జీవితంలో  ఔన్నత్యం నిరాడంబరత నుంచే వస్తాయి.  వాల్డ్ విట్ మన్
కవితకు మెప్పు,  కాంతకు కొప్పు అందం.
క్షణక్షణం కొత్తకొత్తగా కనిపించేదే అసలైన అందం. అదే కమనీయం, రమణీయం.  మాఘుడు
చాలామంది భ్రమించేలాగా, పై మెరుగులు అసలు అందం కాదు, నిజమైన అందం లోపలే ఉంటుంది . స్వామి రామతీర్థ
చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు. ప్లేటో
చిరునవ్వులు, స్నేహాలు, అభిమానాలు, ఆకాంక్షలు జీవితానికి అందం చేకూరుస్తాయి. ఎం.ఎ. కెల్లీ
నేను  అందంగా లేకపోవచ్చు.  కానీ, సాయం కోరే వాళ్ళకు నా చేతిని అందించగలను. అందం మొహంలో వుండదు,   హృదయంలో ఉంటుంది. అబ్దుల్ కలాం
వాపు బలుపు కాదు ,  వాత అందం కాదు.
 
 

కామెంట్‌లు