నిజమైన స్నేహం.:-పండుగాయలసుమలత.గొట్లూరు.కర్నూలుజిల్లా.

  ఒక అడవిలో ఒక జింక గడ్డి మేస్తుండగా పక్కనే పొదల్లో చిక్కుకున్న చిన్న పులి పిల్ల కనిపించింది.జింక ఆ పులిపిల్లను కాపాడి, పెంచి పెద్ద చేస్తుంది.జింకకు చిన్న జింక పిల్ల పుడుతుంది.
 ఒక రోజు ఆహారం కోసం జింక అడవిలో తిరుగుతుండగా వేటగాని చేతిలో బలి అవుతుంది. అప్పటి నుండి పులి పిల్లను కాపాడినందుకు ఋణంగా. ఆ చిన్న జింక పిల్లను పులి ప్రాణంగా చూసుకుంటుంది. పులి కూడా జింకతో కలిసి ఆకులు, పండ్లు తినేది. అలా వాటి స్నేహం గురించి అడవి అంతా పాకుతుంది.పులితోడు ఉండగా జింకకు ఎలాంటి అపాయం వచ్చేది కాదు. అలా వాటి నిజమైన స్నేహాన్ని చూసి నక్కకు ఈర్ష పుడుతుంది.ఎలాగైనా వాటిని విడదీయాలనుకుంది. 
ఒక రోజు పులి లేని సమయంలో"నీవు బాగా పెరిగాక నిన్ను ఏదో ఒకరోజు పులి చంపితింటుంది"అని జింకకు మాయ  మాటలు చెప్పేది నక్క. జింక మొదట నమ్మలేదు.అదే అడవిలో మరో పులి మరో జింకను వేటాడడం చూపించి "ఇప్పటికైనా నమ్ముతావా?" అంది నక్క ,జింకతో. ఇక పులి వచ్చే సమయం కావడంతో అక్కడినుండి మెల్లగా జారుకుంది జిత్తులమారి నక్క. ‌‌.అప్పటినుండి జింక, పులితో స్నేహం మంచిదికాదు అనుకుంది. కాని పులి మాత్రం నిజాయితీగానే ఉండేది.అలా ఉండగా ఒక రోజు జింక అడవిలో తిరుగుతుండగా ఒక వేటగాడు జింకకు గురిపెట్టాడు, అది చూసిన పులి వేటగాడి మీదకు దూకి ప్రాణాపాయం నుండి జింకను రక్షించింది.అలా పులి నిజాయితీని తెలుసుకొని క్షమాపణ కోరింది జింక. అప్పటినుండి ఇంకా ఎక్కువ స్నేహభావంతో కలిసి ఉన్నారు జింక, పులి. వాటి నిజమైన స్నేహాన్ని చూసిన నక్కకూడా మారిపోయి వారితో స్నేహం చేయడం మొదలు పెట్టింది.స్నేహానికి జాతులు అడ్డురావని నిరుపించాయి జింక, పులి.

కామెంట్‌లు