హృదయం పదిలం :-ఎం. వి. ఉమాదేవి

జీవితపు కారణము  జేగంట హృదయమ్ము 
నీవెంట నేయుండి నీజన్మ కొనసాగు 

లబ్ డబ్బు శబ్దాలు లక్షలగు సారులును 
విశ్రాంతి యెరుగకను వెలయించు నీయునికి 

తల్లిగర్భము నుండి తాను కాపాడుచును 
చెల్లించు నీఋణము చెలరేగు బంధాల

అటువంటి హృదయాన అసూయా ద్వేషాలు 
ఆస్తులకు పేరాశ అవకాశ వాదమ్ము 

ఒత్తిడిని పెంచుతూ ఒక రవ్వ నాయుష్షు 
తగ్గించు వేయునది తలరాత కాదు యది 

హృదయమ్ము పదిలమ్ము హృదయ భారము లేక 
మనిషిగా జీవించు మరియాద చూపించు 

దానములు ధర్మమును దయచూపు హృదయమ్ము 
మితమైన తిండియును సతతమ్ము శ్రమజేయ 

ప్రకృతిలో సారమును ప్రతిచోట గమనించు
హృదయమ్ము దానమది హృదయపూర్వక సేవ !!
కామెంట్‌లు