ఇంటి తోట: -పెందోట వెంకటేశ్వర్లు, బద్దిపడగ

జాగలేదని ఆగొద్దు
టైమేలేదని నిలువొద్దు
చిన్నచిన్న డబ్బాలు తెచ్చి 
మొక్కలు కొన్ని నాటాలి

నీరును పోస్తూ పెంచాలి
ఎన్నో పువ్వులు పూస్తాయి
కాయలు కొన్ని కాస్తాయి
ఆనందాలే పండుతాయి

పిట్ట గోడలపైన పెట్టొచ్చు
బెండ, వంకాయ, టమాట 
మిరప ,  ఆకుకూరలేయొచ్చు
ఇంటి తోటగా మార్చొచ్చు.

కామెంట్‌లు