గురువుల సన్నిధి విద్యే: ఎన్ . జయంత్ శర్మ

గురువుల సన్నిధి విద్యే
సకల సంపద నిధి
గుడివంటి బడిలోనే
పరమ గురువులు మాదైవం.

తరగతి గదిలోనే తరతమాలులేని
ప్రపంచ విజ్ఞానం వికసించునిధే
ఆటపాట మాటల మనోవికాసమేనిది
మహనీయమై మాకెంతో అలరించేది.

నీతి న్యాయ మానవ విలువలకు
ఆలవాలమై ఆనందాలెంతో పంచేదీ
గురుభక్తికీ సృజనాది శక్తులకివి యెపుడు
నిత్య నూతన విజ్ఞాన వికసిత నిలయాలు
మావిద్యాలయాలు మనోవికాసాలు

కామెంట్‌లు