:నానీలు --డాక్టర్ కెఎల్వి ప్రసాద్ -హన్మకొండ.

 వర్షాకాలమే-
అయినా అకాలవర్షం ..!
ఇళ్లల్లో వరదలు ,
రెడ్ అలర్ట్ ....!!
-------------------------------
రోడ్లన్నీ నీటి చాపలు 
గోతులెక్కడో -
గొప్పులెక్కడో -
ప్రమాద ఘంటికలు !!
--------------------------------
లోతట్టు ప్రాంతాలకు
నిత్యం.వరదల భయం 
కాంట్రాక్టర్లకు ...
కామధేనువే ....!!
------------------------------
చినుకు పడితే 
గుర్తుకొస్తాయి రోడ్లు !
వరదలా....
విహంగ సర్వే తోసరి!!
--------------------------------

కామెంట్‌లు