కవి హృదయం:-పంపిన వారు:;కొండముది; రాజ గోపాల్,-హైదరాబాదు

 కవి సామ్రాట్ విశ్వనాథ సత్య నారాయణ గారి పేరు వినని సాహిత్యాభిలా షులు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ తెలుగులో లేదు.నవలలు,కథలు,కవితలు,గ్రంధాలు ,పాటలు ,పద్యాలు ఒకటేమిటి అన్నిటా అందెవేసిన చేయి.రామాయణ కల్పవృక్షము నకు జ్ఞ్యాన్ పీఠ్ అవార్డు అందుకున్నారు.మీకు తెలియంది కాదు కానీ ఆయన రచనలలో అంతర్భాగ మై అంతర్లీనంగా కనపడే భావం తెలుగు వాడి దేశ భక్తి మరియు భారతీయ సంస్కృతి పట్ల వల్లమాలిన ప్రేమ.చిన్న నాటనే ఆంధ్ర ప్రశస్తి రచించారు .
వేయి పడగలు నవల విశ్వనాథ వారు ఎంతో ప్రయాస పడి రచించారు.ఈ విస్తృత నవలలో ఆయన తన భావాలన్నీ పొందు పరచారు.ఈ నవల చదువుతుంటే మనం కూడా వివిధ భావోగ్వేదాలకు గురి అవుతాం.విశ్వనాథ వారు నాయకుడైన ధర్మారావు పాత్ర మలచిన తీరు మహోత్కృష్టమినది.ధర్మ రావు బ్రాహ్మణ యువకుడు.తండ్రి ఎడల అత్యంత భక్తి శ్రద్ధలు కలవాడు తండ్రి రామేశ్వర శాస్త్రి,దైవ నిర్ణయం తో వేరు వేరు స్త్రీలను చేపట్టి సంతానము పొందినా వారి ఎడల కూడా సోదర మైత్రిని నెరపడ ము చూస్తాము.వేయిపడగలు నిండా వేలాది వర్ణనలు సందర్భోచితంగా ,వందలాది పాత్రల వేలాది మనస్తత్వాలు ఎక్కడా విసుగానిపించని విధంగా కథా గమనం,సంవత్సరానికి 365 రోజులు ఉంటే ప్రతి రోజూ వారి వర్ణనలు కథకు ఉపయోగ పడే విధంగా కథను సూచించే విధంగా మలచిన తీరు పూర్వ కవుల రచనలు పోలి ఉండడం వాటి కన్న మించి ఉండడం వేయెల తెలుగు సాహిత్యం లోని పూర్వ కవుల రచనా శైలిని తెలుసుకోవాలన్నా ,హైందవ సంప్రదాయాన్ని , ఔన్నత్యాన్ని గ్రహించాలని ఆన్నా వేయి పడగల నవల ఒక్కటి చదివితే చాలు మనిషికి తెలుగు,తెలివి రావడం తధ్యం.
కలలో న రాజును పాము కరచినదనుటలో నాటి వైదిక భారత సమాజం పరాయి దేశాల ప్రభావానికి గురి అవడానికి సూచితము జమీందారులు పూర్వము,నాడు తెలుగు నాట ఎట్లుండిరో కథలో ధర్మారావు జమీందారు ను ఎట్లు పూర్వ పద్ధతిలోనికి మార్చినాడో విశ్వనాథ వారు కడు రమణీయంగా కల్పన చేసినాడు ధర్మారావు పాత్ర లో విశ్వనాథ వారే కనబడతారు .నాటి సామాజిక, రాజకీయ, స్థితి గతులు నవల నిండా చర్చించ బడ్డాయి.
ఆయనకు స్త్రీల పట్ల గౌరవం బాగా కనపడుతుంది.కలి యుగంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తుందని అంటారు.ఆయన వేయి పడగలు లో ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తూ  భారతీయ సంస్కృతి లో నిలిచిన ధర్మం స్త్రీ ఒక భర్త తోనే జీవితాంతం గడపడం గా చూస్తాం .ఇదే వేయి పడగలలోని ఒక పడగ.ఇదే నేటి యుగంలో నిలిచిన ఒక ధర్మం అని ఆయన భావన.సముద్రుడు చెలియలి కట్ట దాటకపోవడానికి కూడా స్త్రీలలో ని ఈ ధర్మమే స్త్రీల పాతివ్రత్యం గా చూస్తాం.ఈతని రచనలు నేటి సమాజానికి వేప గుళికలు.కొంచెం ప్రయాస పడితే ఈతని రచనలు అమృత తుల్యాలు.ప్రతి ఒక్కరూ చదువ తగిన రచనలు.ఈ నా ప్రయత్నం సముద్రాన్ని చిన్న పాత్రతో కొలిచి నట్టే.
.
కామెంట్‌లు