ఆడబిడ్డలు:-కుంటముక్కుల సత్యవాణి

 పుట్టింటివారు సపిలవాలనే
పట్టింపులేదు
అలకలు లేవు
ఆర్భాటాలసలేవు
పెట్టాలనే  పట్టుదల లేదు
పెట్టింది బాగాలేదనే
కినుకా లేదు
మేడలుమిద్దెలూ
అడగరు వీరు
పట్టుపరుపుల సౌఖ్యాలుకోరరు
పంచభక్ష్య పరమాన్నాలడగరు
పసందైన విందులుా కోరరు
వారి కోరికలు అతి సామాన్యమైనవి
పుట్టినూళ్ళో పచ్చని చెట్లుండాలని
కోరుకొంటారు
చల్లని నీటిదొరువులు
చెరువులుంటే చాలనుకొంటారు
ఉన్నన్నాళ్ళూ ఉత్సాహంగా వుండీ
ఊరందరిలో ఉత్సాహం నింపి
చీరా సారే అడగ కుండానే
చిటికెడు పసుపూ కుంకుమా
ఆశించకుండానే
అత్తింటికి దారితీస్తారు
తాము మళ్ళీ యేడాది వచ్చేసరికి
తమ పుట్టినూరు
సుభిక్షంగా
సశ్య శ్యామంలంగా
వుండాలని మరీ మరీ
దీవించి వెడతారు
తమ ఆడబిడ్డలను
కళ్ళలో పెట్టుకు కాచిన
అన్నదమ్ముల మనసు
చిన్నబోయినా
ఆడబిడ్డలు వచ్చి వెళితే చాలు
పట్టెడు గింజలు పండే భూములు
పుట్టెడు గింజలను పంటిస్తాయనే సతోషంతో
మునిగి తేలతారు
మళ్ళీ వారి రాకకు ఎప్పుడెప్పుడా అని
ఎదురు చూస్తూవుంటారు
 పుట్టినింటివారు
                    
కామెంట్‌లు