చిన్నారులకు-పుస్తక కానుక:- త్రిపురారి పద్మ.

  విజయనగరానికి చెందిన బండారు బాలానంద సంఘం వారు చేస్తున్న సాహిత్య సేవ ఎంతో ఘనమైనది.జిల్లాకొక బాలానంద సంఘం వాట్సాప్ సమూహం ఏర్పాటు చేసి,విలువలతో కూడిన విద్యను అందించే విధంగా తయారు చేసిన ప్రశ్నావళితో క్విజ్ నిర్వహిస్తున్నారు.విజేతలయినవారికి పుస్తకాలను బహుమతులుగా పంపిస్తున్నారు.రెండు తెలుగు రాష్టాల పిల్లలకి పోస్టల్ ఖర్చు భరించి మరీ ఇలా పుస్తకాలు పంపించడం ఎంత గొప్ప సేవ.
   ఇంతటి ఉత్తమ సాహితీ సేవా సంస్థ నుండి మా పాఠశాల విద్యార్థులు శిరీష, రియాజ్ బహుమతులు అందుకోవడం సంతోషదాయకం.
    మొన్నటి రోజున అందిన ఈ పుస్తకాలను ఈరోజు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమక్షంలో వారికి అందజేయడం జరిగింది.
         
కామెంట్‌లు