ఊహల పల్లకి ఉత్తేజము
ఊహాలోకం స్వర్గతుల్యం
అసాధ్యములన్ని సుసాధ్యములు
మత్తు లోకము మాధుర్యము
:: ఊహ :::
హృదయమునందు తీరని కోరిక
భారముతోన బందీ చేయును
ఆరోగ్యమే అతలాకుతలం
క్షణక్షణం సుడిగుండాలు
::ఊహ ::
అందుకే ఊహాలోకం
తీరని కోరిక పరుగులెత్తేను
సృశించు గుండెను ఆనందంతో
కమనీయము అత్యద్భుతము
రమణీయము భావ తరంగం
:: ఊహ ::
మెట్లు లేని ఒంటి స్తంభం మెడలులెన్నో
సప్తవర్ణ శోభితంగా రాజ భోగ మందిస్థాయి
నృత్యాలతో చెలికత్తెలతో ఇంద్రభవనమై వెలిగిపోయేను
ఖర్చులేకుండా ఊహాలోకం కోరికలులెన్నో తీర్చేసును
::ఊహ::
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి