"చ" గుణింత గేయం:--- మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలు--జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

చల్లని నవ్వుల బాలల్లారా
చాచా నెహ్రూ పువ్వుల్లారా
చిలుక పలుకుల మాటలు
చీకటి తరిమే దివ్వెలు
చుక్కలు  జూడగ మెరుపులు
చూసిన చాలు చిత్రాలు
"చృ "అక్షరం  పలకండి
"చౄ " అక్షరం గమనించండి
చెట్ల వల్ల పచ్చ దనాలు
చేయును నందన వనాలు
చైతన్య  దీపికలు
చొరవ కలిగియుండాలి
చోద్యమనక నేర్వాలి
చౌక ఆలోచనలు  మానాలి
చందమామలా వెలగాలి.

కామెంట్‌లు