తల్లిదండ్రుల బాధ్యత. తాటి కోల పద్మావతి గుంటూరు.

 చిన్న వయసులో పిల్లలు బాగుపడిన చెడిపోయిన దానికి బాధ్యత తల్లిదండ్రులది గురువుల దీ. దీనికి ఉదాహరణ పెద్దలు చెబుతారు.
చిన్నప్పటినుంచి శకుని మామ మాట విని దుర్యోధనుడు పాండవులను హింసించసాగాడు. గాంధారి ధృతరాష్ట్రుడు పుత్రుని మీద మమకారం అనే అంధకారంలో కూరుకుపోయి కుమారుని సమర్థిస్తూ వచ్చారు. పెద్దవాడయ్యాక అతని తల్లిదండ్రుల మాటల్ని ఏమాత్రం వినలేదు.
ఇవాళ మనం పిల్లల్ని బుజ్జగించి, వారు కోరిందల్లా తీరుస్తూ పోతే చివరికి వాళ్లే శత్రువులు అవుతారు. నశిస్తారు కూడా. మొక్కై వంగనిది మానైవంగుతుందా. అని అని అందుకే అంటారు. మరో విషయం బంధువుల్ని ద్వేషించడం పిల్లలకు ఎప్పుడు నేర్ప రాదు. పెద్దలు నేర్పిన పిల్లలు నేర్చుకో రాదు.
పిల్లలను క్రమశిక్షణతో పెంచి మంచి అలవాట్లు నేర్పటం పెద్దల బాధ్యత. పిల్లలు తెలియక తప్పు చేసినా వారికి అర్థమయ్యేటట్లు చెప్పి ఆ తప్పును మరోసారి చేయకుండా చూసుకోవాలి. చిన్న పిల్లలే కదా అని ఊరుకుంటే రేపు పెరిగి పెద్దయిన తర్వాత పెద్దలను కూడా బెదిరించ గలరు. మంచి నడవడిక విజ్ఞానం సంప్రదాయాలు అన్ని చిన్నప్పటినుంచే పిల్లలకు బోధించాలి. పిల్లల్ని బుజ్జగించి గారాబం చేస్తే పెద్ద అయిన తరువాత వాళ్లని క్రమశిక్షణలో పెట్టడం చాలా కష్టం. చిన్నప్పటినుంచే మంచి అలవాట్లు ఎదుటి వారిని గౌరవించడం పెద్దలకు నమస్కరించడం ఇతరులకు సహాయపడటం మంచి గుణాలను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత.
కామెంట్‌లు