*బాలనరేంద్రుడు(కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియ లో)(రెండవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 5)
మిత్రులజంట కొంతదవ్వు వెళ్ళింది
వీరివెనుకే ఒకబండి వస్తోంది
వీధి మలుపు చోటండి
వెనుక ఏమీ కనబడదండి!
6)
 బండివచ్చింది వేగంగా వెనుకనుండీ
 ఢీకొట్టబోయింది నేస్తపు జంటకండీ
మాటల్లో పడివారు చూడలేదు
బండి వస్తోందని గ్రహించలేదు!
7)
పక్క నున్న మిత్రుడపుడు
బండి కింద పడబోయాడు
బాలుడు ప్రమాదము గ్రహించెను
త్వరగా అపుడె స్పందించెను!
8)
అపాయము గ్రహించిన ఆబాలుడు
తనచేతిలోని శివునిబొమ్మ విసిరేశాడు
చేతులతో తనమిత్రుని ప్రక్కకుతోసె
తానుగూడ ప్రక్కకు దూకేసె!
(సశేషము)

కామెంట్‌లు