*దారిదీపం*(బాలగేయం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 పుస్తకం ఇది పుస్తకం
మహాజ్యోతి ఈపుస్తకం
అజ్ఞానతిమిర పయనంలో
బాటచూపే దారిదీపం
మంచినడవడి మంచిఒరవడి
బాటచూపే దారిదీపం
నీతినియమము శాంతిసహనము
బాటచూపే దారిదీపం
ఆటపాటల స్వఛ్ఛమనసుల
బాటచూపే దారిదీపం
తల్లిగడ్డకు సేవచేయగ
బాటచూపే దారిదీపం
దైవభక్తికి దేశభక్తికి
బాటచూపే దారిదీపం!!!

కామెంట్‌లు