కృష్ణ భక్తిలో మీరాబాయి:---మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

సీసమాలిక

రాజవంశము లోన  రమ్యముగాబుట్టి
భోజ రాజును పొందె పుడమి నందు,
నత్తమామలు బెట్టె యాగడాలు తెలుప
భక్తి భావము చేత పరవశించి,
పరమాత్మ చింతన ప్రాపంచ విషయంబు
విడనాడి కృష్ణుని వేడుకొనుచు,
కనులు మూసిన నీవె కనులు తిరియ నీవె
యంటు తంబుర మీటి హాయిగాను,
తన్మయ మొందుతు తనలోనె తానుయే
మురళీధరుని జూసి మురియుచుండు,
గోవింద భజనలు కోకొల్లలుగ జేసి
మీరా భక్తిని చాటె మేధి నందు,
మాధవ దర్శనం మదిలోన నిత్యము
తలచి ముదమునందు తనివిదీర,
కృష్ణ భక్తి కిమారు కృప తోడ మీరయే
నిలువెత్తు నీరూపు నీరజాక్ష.

తేటగీతి

మధుర గేయాలు నెన్నెన్నొ మాధవాని,
పాడుచుండెను లీనమై పరమ సాధ్వి,
భక్తి మార్గము చాటెను  భావమలర ,
ముక్తి పొందెను భక్తితో మూల మెఱిగి .

కామెంట్‌లు