సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఆజాధీ కా అమృత్ మహోత్సవ వేడుకలు

 
సాహితీ బృందావన జాతీయ వేదిక నేను సైతం యూట్యూబ్ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో
భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆజాధీ కా అమృత మహోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని కవులకు కవయిత్రుల కు ప్రత్యేక ఆహ్వానం పలికి 
ఆడియో కవితల ఈ సంకలనం అంతర్జాల కవి సమ్మేళనం లో కవితాగానం రికార్డును ముందు తరాలకు శాశ్వతంగా ఉండిపోయేలా కవుల రచనలను యూట్యూబ్లో భద్రపరిచి ప్రపంచానికి వారి రచనల ద్వారా వారిని పరిచయం చేయడం కోసం మరియు
 సెప్టెంబర్ 28 భగత్ సింగ్ జయంతిసందర్భంగా విప్లవ చైతన్యం అనే ఆడియో రికార్డు ఈ సంకలనం
చేసి కవి సమ్మేళనం లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి భగత్ సింగ్ జాతీయ పురస్కారాలు 140 కవులు కవయిత్రులు అందించడం జరిగింది.నూతన కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ముందు ఉండి సాహితీ బృందావన జాతీయ వేదిక  చేసే నిస్వార్ధమైన సేవలను ప్రముఖులు సాహితీ వేత్తలు అభినందించారు.
ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన
ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన ఆజాధీ కా అమృత మహోత్సవ వేడుకలలోపాల్గొన లేక పోయినా ఇక్కడ భాగస్వాములం అయినందుకు చాలా సంతోషంగా ఉంది భగత్ సింగ్ జాతీయ పురస్కారం అందుకోవడం అని కవులు కవయిత్రులు ఆనందం వ్యక్తం చేశారు.
సాహితీ బృందావన జాతీయ వేదిక వ్యవస్థాపక అధినేత్రి శ్రీమతి నెల్లుట్ల సునీత కవి సమ్మేళనంలో పాల్గొనీ  విజయవంతం చేసిన 140 కవులు కవయిత్రులు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
భగత్ సింగ్ జాతీయ పురస్కారం_ 2021 మా వేదిక నుండి అందించడం చాలా ఆనందంగా ఉందని  ఆజా ధి కా అమృత్ మహోత్సవం సంబరాల వేడుకలలో భాగంగా
 భగత్ సింగ్ జాతీయ పురస్కారం  భగత్ సింగ్ జయంతి రోజున అందుకున్న పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి ప్రోత్సహిస్తున్నా నేను సైతం యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర యూనివర్సిటీ దేవరపు ఈశ్వరరావు గారు వేదిక తో సంయుక్తంగా ఈ కవి సమ్మేళనం నిర్వహించి వేదికను పరిచయం చేస్తున్నందుకు వారికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
కామెంట్‌లు