అకాల వర్షాలు రైతుల కష్టాలు : వనజ వల్లంభట్ల

 సిరుల వాన గురియ విరియును పుడమియే
పచ్చని పసిమిగ పంట మెరిసె
వడగండ్ల వానలే కడగండ్లు తెచ్చేను
కన్నీటి కడలిలో కరిగి పోగ
పంచ భూ త మ్ము లే పగబ ట్టినట్టు గా
ప్రళయమై విచ్చేసి పంట ముంచె
కూడు లేకుండేను గూడునూ చెదిరే ను
కాలమే రైతును కాటు వేసె

ఆ. వె
కన్న బిడ్డ కన్న మిన్నగా పెంచేను
కళ్ళ ముందె అంత కరిగి పోయె
ఆశ లన్ని కూలి అప్పులే మిగిలేను
బడుగు జీవి బతుకు బండ లాయె
                    
కామెంట్‌లు