చిత్రం _విచిత్రం సైన్స్ వ్యాసం: -ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)

 మనం ఒక చిత్రాన్ని గీస్తున్నాంఅంటే మెదడు లో ఏం జరుగుతుంది. సరిగ్గ అలాగే మనం ఒక చిత్రాన్ని చూసి చూసి ఆ చిత్రాన్ని గుర్తిస్తాం. అలాగే రెండు చిత్రాల మధ్య తేడాను గుర్తిస్తాం మరియు విభిన్న చిత్రాలను ఒకదానితో ఒకటి పోల్చి చూసి చెప్తాం. అంటే మెదడులో న్యూరాన్స్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనిపిస్తుంది.

ఇంకొంచెం ముందుకెళ్తే మనం మాట్లాడే మాటలు భాష ఆ భాష ద్వారా పొందిన భావన అనుభూతి అంతా కూడా ఎలా బ్రెయిన్ లో పొందుపరచబడ్డాయో అంటే బ్రెయిన్ న్యూరో లింగ్విస్టిక్ సాంకేతికత కూడా పై వాటి మాదిరిగానే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా గీయడం, కంటితో కొన్ని చిత్రాలను గుర్తించడం, అలాగే రెండు చిత్రాల మధ్య తేడాను విభిన్నతను గుర్తించడం, అలాగే భాష ద్వారా పొందిన అనుభూతి భాషా సాంకేతికత అంతా ఒక లాగే మెదడులో నిక్షిప్తం అవుతూ , ఒక న్యూరో లింగ్విస్టిక్ సాంకేతికత సంకేతం ఏర్పరచుకుంటుంది అన్నది నిజం.
ఇది నిజమైతే మనం భాషను నేర్చుకున్నట్లు మనిషి బొమ్మను ఉన్నది ఉన్నట్టుగా గీయడం నేర్చుకోవచ్చు. భాష ద్వారా పొందిన సమాచారం మాదిరిగా భావనలను, అనుభూతులను కూడా న్యూరో లింగ్విస్టిక్ సాంకేతికత సంకేతాలు ఆ చిత్రాల ద్వారా పొందవచ్చును స్పందించవచ్చు ను. కంటి ద్వారా రెండు చిత్రాల మధ్య తేడాను గుర్తించినట్లు కొన్ని వేల లక్షల చిత్రాల తేడాను కూడా గుర్తించవచ్చును. లేదా ఆ లక్షల చిత్రాలలోరెండు దగ్గరి సంబంధం ఉన్న చిత్రాలను కూడా గుర్తించవచ్చు.
అంటే ఈ న్యూరో లింగ్విస్టిక్ సాంకేతికత సంకేతంతో మనిషి కోట్ల లో ఉన్న మనుషుల తేడాను గుర్తించినట్లు ఈ సాంకేతికత ద్వారా అర్థమవుతుంది. కావలసిందల్లా ఈ న్యూరో లింగ్విస్టిక్ టెక్నిక్ మనం గుర్తించడం చేయాల్సిన పని. ఖచ్చితంగా ఈ సాంకేతికత టెక్నిక్ భాషకు, చిత్రకారుని కి, కంటికి సంబంధించిన బ్రెయిన్ న్యూరాన్స్ లో సరిగ్గా అంతా ఒకేలా ఉంటుందని మనం గుర్తించాలి. దీన్ని వ్యక్తం చేయడానికి చిత్రకారుని కి చిత్రం ద్వారా కంటికి ఇద్దరు మనుషుల మధ్య తేడాను, ఇద్దరు మనుషులు ఒకేలా ఉన్నట్లుగా గుర్తించటం.
భాష ద్వారా భావనలు అనుభూతులు సమాచారం అందించే న్యూరో లింగ్విస్టిక్ సాంకేతికత సంకేతం ఒకేలా ఉండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సాంకేతికతను రాబట్టాలంటే భాష సాంకేతికత సంకేతం బ్రెయిన్ లో ఎలా రూపుదిద్దుకొని ఉందో గుర్తిస్తే చాలు.
అంటే భాష న్యూరో లింగ్విస్టిక్ సాంకేతికత గుర్తించినట్లయితే దాని యంత్రాంగాన్ని, ఉన్నది ఉన్నట్లుగా మనం పొందుతున్న చిత్రకారుడు, కంటి చిత్రాన్ని బ్రెయిన్ లో ఆ ఆ అవేర్నెస్ ను ఆ నైపుణ్యం ని ఈ టెక్నిక్ ద్వారా పొందవచ్చును.
ఆదిలో పక్షులు జంతువుల్లో న్యూరో లింగ్విస్టిక్ సాంకేతికత సంకేతం విజువల్ వర్డ్ ఫార్మేషన్ సెంటర్లో ఒక విజువల్ వర్డ్ గా
రూపుదిద్దుకున్నది అది తర్వాత తర్వాత బుద్ధిజీవుల్లో విజువల్ వర్డ్ ఫార్మేషన్ సెంటర్లో ఒక భాషగా గా ఒక వర్డ్ గా సంకేతంగా మారింది. అంటే ఆ విజువల్ వార్డు ఫార్మేషన్ సెంటర్ లోనే భాష ఏర్పడింది సరిగ్గా అలాగే చిత్రకారుని నైపుణ్యాలు, కన్ను ద్వారా మనిషి మనుషులను గుర్తించడం సారూప్యతను, భేదాలు గుర్తించడం నేర్చుకున్నాడు. ఇది కూడా ఒక భాష లాగానే జరిగింది అని మనం గుర్తించాలి. అనగా ఇక్కడ చిత్రం విచిత్రం ఒక ఒక విజువల్ వర్డ్ ఫార్మేషన్ సెంటర్లో చిత్రం జరుగుతుందని మనం ఒక శాస్త్రీయ నిర్ణయానికి రావచ్చు.!?.
Pratapkoutilya lecturer in Bio-Chem palem,8309529273.

కామెంట్‌లు