సమస్యా పూరణలు-సాహితీసింధు సరళ గున్నాల

దేవుడు  లేడన్నవాడు దేవుని నమ్మెన్

కందం*చావుకుదగ్గరజేరుచు
కావడితాకంటబడగ కలవరపడుచున్
దైవమునిరతముగలడని
దేవుడులేడన్నవాడు దేవునినమ్మెన్

సమస్యా పూరణము
మాటదప్పువారు మాన్యులెపుడు

ఆ.వె*తప్పుజేయవెరసి ధర్మంబుదప్పకన్
న్యాయ మార్గమందు నడచువారు
దోషమెల్లజేయు దుర్మార్గులకిడిన
మాట,దప్పువారు మాన్యులెపుడు

కామెంట్‌లు