ఆకాశం అనంతం: డాక్టర్ కందేపి రాణిప్రసాద్ , సిరిసిల్ల

ఆకాశమంత పందిరి కింద
భూదేవి అంత అరుగు పైన
ముక్కోటి దేవతలు కొలువుతీర
పెళ్లి చేస్తామని ఘనంగా చెప్తాము.

ఆకాశమే హద్దుగా అవకాశాలు
అందుకోమని ఆశీర్వదిస్తరు
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు
అత్యాశకు బోయేవడ్ని అంటారు.

ఆకాశమంత ఎంతో ఉన్నతమైనది
ఆకాశాన్ని అందుకోవడం అసాధ్యం
ఆకాశం, భూమి ఎప్పటికీ కలవవు
అవి రెండూ కలిసినట్లు కనిపిస్తాయి.

ఇదంతా మన పూర్వకాలపు ఆకాశం
ఆకాశం అంటే అంతరిక్షం ,విశాల విశ్వం
సూర్య చంద్రులు,గ్రహాలు, అన్నీ విశ్వంలో
నక్షత్రాలు,వాటి కదలికలు నష్టాలు కాదు.
ఆకాశం అందమైనది
ఆకాశం అనంతమైనది
ఆకాశం అద్వితీయమైన 
ఆకాశం అద్భుత మైనది.
కామెంట్‌లు